Mood of the Nation : మహారాష్ట్రలో ఇండియా కూటమి హవా.. ‘ఇండియా టుడే- మూడ్ ఆఫ్ ది నేషన్’ ఒపీనియన్ పోల్ నివేదిక
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాది చివర్లోగా జరగనున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాది చివర్లోగా జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ‘ఇండియా టుడే- మూడ్ ఆఫ్ ది నేషన్’ ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించగా కీలక అంచనాలు వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో లోక్‌సభ పోల్స్ మళ్లీ నిర్వహిస్తే బీజేపీ మూడు లోక్‌సభ స్థానాలను పెంచుకుంటుందని గుర్తించారు. దీంతో ఎన్డీయే కూటమికి మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 9 నుంచి 12కు పెరుగుతుందని వెల్లడైంది. ఇక కాంగ్రెస్ పార్టీకీ మూడు లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని, దీంతో ఇండియా కూటమి ఎంపీల సంఖ్య 16కు చేరుతుందని సర్వే నివేదిక పేర్కొంది.
ఈ సర్వేలో పాల్గొన్న మహారాష్ట్ర వాసుల్లో 33 శాతం మంది రాష్ట్రంలోని ఎన్డీయే సర్కారు పనితీరుతో సంతృప్తిగా లేమని స్పష్టం చేశారు. కొంతమేర సంతృప్తితో ఉన్నామని 34 శాతం మంది, సంతృప్తితో ఉన్నామని 25 శాతం మంది చెప్పారు. విపక్ష ఇండియా కూటమి పనితీరుతో సంతృప్తిగా లేమని 30 శాతం మంది చెప్పారు. కొంతమేర సంతృప్తితో ఉన్నామని 21 శాతం మంది చెప్పగా, సంతృప్తితో ఉన్నామని 11 శాతం మంది బదులిచ్చారు.