జోడోయాత్రలో మిత్ర పక్ష పార్టీలకు ఆహ్వానం.. కానీ నాకు రాలేదన్న ఎస్పీ చీఫ్
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకే సిద్ధాంతాన్ని కలిగి ఉంటాయని అన్నారు. అయితే తమ పార్టీది వేరే సిద్ధాంతమని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో తాను పాల్గొనట్లేదని గురువారం స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని మీడియాకు వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో ప్రతి రాష్ట్రంలో మిత్ర పక్ష పార్టీలను ఆహ్వానిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూపీలో మాత్రం ఎస్పీతో సహా మాయావతి బీఎస్పీకి కూడా ఆహ్వానం పలకేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అంతకుముందు సీపీఎం పార్టీ నేత సీతారాం ఏచూరీ కూడా తమకు జోడో యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ ఆహ్వానం ఇవ్వలేదని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Also Read...
Rahul Gandhi violated security guidelines 113 times in 2 years