1977 తర్వాత అత్యంత సుదీర్ఘ తుఫాను బిపర్జాయ్ : ఐఎండీ

దేశంలోని పశ్చిమ తీరాన్ని వణికించి వెళ్లిన బిపర్జాయ్ తుఫానుకు సంబంధించిన ఓ ముఖ్య విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది.

Update: 2023-06-26 17:08 GMT

అహ్మదాబాద్ : దేశంలోని పశ్చిమ తీరాన్ని వణికించి వెళ్లిన బిపర్జాయ్ తుఫానుకు సంబంధించిన ఓ ముఖ్య విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. 1977 సంవత్సరం తర్వాత ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన తుఫాను బిపర్జాయ్ అని వెల్లడించింది. జూన్ 6న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉద్భవించిన బిపర్జాయ్ తుఫాను.. జూన్ 15న సౌరాష్ట్ర, కచ్ మీదుగా తీరాన్ని తాకి జూన్ 18న అల్పపీడనంగా మారి బలహీనపడింది.

ఈ తుఫాను జీవిత కాలం 13 రోజుల 3 గంటలు. అరేబియా సముద్రంలో ఉద్భవించే తీవ్ర తుఫానులు సగటున 6 రోజుల 3 గంటల పాటు మాత్రమే లైవ్ గా ఉంటాయి. వీటితో పోలిస్తే బిపర్జాయ్ తుఫాను సగటు జీవితకాలం రెట్టింపు ఉందని పై లెక్కలను బట్టి స్పష్టమవుతోంది. చివరిసారిగా ఇంత సుదీర్ఘకాలం పాటు కొనసాగిన తుఫాను 1977 నవంబర్ 8న ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడింది. అది బంగాళాఖాతంలో అభివృద్ధి చెంది 1977 నవంబర్ 23 వరకు (ఆరు గంటలు) కొనసాగింది.


Similar News