దోషులను సన్మానించడం కరెక్ట్ కాదు? : Devendra Fadnavis
ముంబై: బిల్కిస్ బానో కేసులో విడుదలైన 11 మంది దోషులను సన్మానించడం చట్ట వ్యతిరేకమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
ముంబై: బిల్కిస్ బానో కేసులో విడుదలైన 11 మంది దోషులను సన్మానించడం చట్ట వ్యతిరేకమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దోషులను విడుదల చేశారని, అయితే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించలేమని బీజేపీ నేత ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. '14-20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన నిందితులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు. అయితే విడుదల అనంతరం నిందితులను సన్మానించడం తప్పు. నిందితులకు ఎవరూ మద్దతు తెలపొద్దు.' అని పేర్కొన్నాడు. కాగా, బిల్కిస్ బానో కేసులోని దోషులను విడుదలను సవాల్ చేస్తూ మహిళా హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో నిందితులు కాబట్టి.. అటువంటి వ్యక్తులను విడుదల చేయొద్దని పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణను పరిగణలో తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.