CM Nitish Kumar: ఢిల్లీకి సీఎం.. ఆ నేతలతో కీలక భేటీ!

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బీజేపీ అధికార పీఠం నుంచి దించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు..

Update: 2022-09-03 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బీజేపీ అధికార పీఠం నుంచి దించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు ఏకతాటిపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లారు. అయితే తాజాగా బీహార్ సీఎం ఢిల్లీకి ప్రయాణం అయ్యేందుకు సిద్ధమవుతున్నారంటూ రిపోర్ట్‌లు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లే జరిగితే నితీష్ సోమవారం నాడు ఢిల్లీకి పయనం కానున్నారని, అక్కడ ప్రతి పక్ష నేతలతో మాట్లాడేందుకు నితీష్ ఈ టూర్ వేయనున్నారని సమాచారం. 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాడేందుకు ప్రతిపక్షాలను ఏకం చేయడంలో భాగంగానే నితీష్ ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా నితీష్ కుమార్ ఈ టూర్‌లో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వామపక్షాల నేతలను కూడా కలవనున్నారని జేడీయూ నేతలు అంటున్నారు. ఇందులో భాగంగా పాట్నాలో జేడీయూ రెండు రోజుల పాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్, నేషనల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో జేడీయూ నేత కుమార్ 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక తాటిపై నడిపించడం గురించి ప్రతిపక్ష నేతలతో చర్చించనున్నారని సమాచారం.

Tags:    

Similar News