తాగితే చస్తారు.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం తాగితే చస్తారని అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం నేపథ్యంలో 2016 తర్వాత ప్రజలు
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం తాగితే చస్తారని అన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం నేపథ్యంలో 2016 తర్వాత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా కల్తీ మద్యం సేవించి మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ మధ్య కాలంలో సరన్ జిల్లాలో 30 మందికిపై గా కల్తీ మద్యం సేవించి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో మద్యపాన నిషేధం అమలు చేయడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం వహించిందని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా నిరసిస్తుంది. తాజాగా అసెంబ్లీ ప్రతిపక్ష సభ్యుల నుద్దేశించి తాగివచ్చారా అని సీఎం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నిషేధంపై విస్తృతంగా అవగాహాన కలిగిస్తోందని ఆయన తెలిపారు. నిషేధం అమల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కల్తీ మద్యం మరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు కల్తీ మద్యం బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి సునీల్ కుమార్ అన్నారు.
Also Read...