అమ్మాయిలకు బిగ్ షాక్.. అక్కడ మొబైల్ వాడకం నిషేధం
ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫోన్లకు బానిసలయ్యారు..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫోన్లకు బానిసలయ్యారు. నిత్యం ఫోన్లలో మునిగితేలుతూ కుటుంబసభ్యులను సైతం పట్టించుకోలేనంతగా మారిపోయారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫోన్‌లో లీనమయ్యారంటే పక్కన యుద్ధం జరుగుతున్నా.. గమనించనంత వ్యసనం చేసుకున్నారు. ఈ విషయంలో గుజరాత్‌లోని ఠాకేర్ అనే కమ్యూనిటీ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికలు ఫోన్ వాడకుండా నిషేధం విధిచింది.
అంతేకాకుండా ఎంగేజ్‌మెంట్‌కు కేవలం 11 మంది మాత్రమే రావాలని, పెళ్లికి డీజే సిస్టమ్ కూడా వినియోగించవద్దని నిర్ణయించారు. ఫోన్ల వల్ల లవ్ ఎఫైర్లు, కులాంతర వివాహాలు పెరిగిపోతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఠాకూర్ కమ్యూనిటీ వారు తెలిపారు. మరో బంపరాఫర్ కూడా ప్రకటించారు. ఉన్నత చదువులు చదివే అమ్మాయిలకు కాలేజీకి వెళ్లడానికి ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామన్నారు.