Rajasthan CM : రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణం..

Update: 2023-12-15 11:16 GMT

జైపూర్ : రాజస్థాన్‌ కొత్త ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని ఆల్బర్ట్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్ర ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్‌ శర్మ సీఎంగా ఎంపికయ్యారు. ఇక దియా సింగ్‌ కుమారి, ప్రేమ్‌‌చంద్‌ బైర్వాలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌ నేత వసుంధరా రాజే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్ తదితరులు హాజరయ్యారు.

రాజస్థాన్‌ రాజకీయాల్లో విరోధులుగా భావించే అశోక్‌ గెహ్లాట్ , కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు ఈసందర్భంగా పక్కపక్కనే కూర్చున్నారు. వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కనిపించారు. సంజీవని కుంభకోణంలో షెకావత్‌ హస్తం ఉందంటూ గెహ్లాట్ అనేక సందర్భాల్లో ఆరోపించారు. దీంతో గెహ్లాట్‌పై ఢిల్లీ కోర్టులో షెకావత్‌ పరువు నష్టం దావా వేశారు.

Tags:    

Similar News