గన్ కల్చర్‌ను అరికట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు

పంజాబ్‌లో తుపాకీ కల్చర్‌పై పంజాబ్ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది..

Update: 2023-03-12 09:15 GMT

చండీగఢ్: పంజాబ్‌లో తుపాకీ కల్చర్‌పై పంజాబ్ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. భగవంత్ మాన్ ప్రభుత్వం ఆదివారం 813 ఆయుధ లైసెన్స్‌లు రద్దు చేసింది. దీంతో ఇప్పటివరకు రద్దు చేసిన వాటి సంఖ్య 2వేలకు పైనే ఉందని అధికారులు తెలిపారు. తుపాకులు వెంట ఉంచుకోవడానికి నిబంధనలు పాటించాలని చెప్పారు.

పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా మరే ఇతర కార్యక్రమాలలో ఆయుధాలను తీసుకెళ్లడం, ప్రదర్శించడంపై ఇప్పుడు నిషేధం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయుధ ఉల్లంఘనకు పాల్పడితే పూర్తి స్థాయి నిషేధం ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో సోదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది. పంజాబ్‌లో మొత్తం 3,73,053 ఆయుధ లైసెన్స్‌లు మంజూరు చేశారు.

Tags:    

Similar News