దేశంలోనే తొలిసారిగా భూగర్భ విద్యుత్ సరఫరా..
గజిబిజి విద్యుత్ తీగలకు.. విద్యుత్ తీగలు తెగిపడి జరిగే ప్రమాదాలకు చెక్ పడే రోజులు ఎంతో దూరంలో లేవు.
బెంగళూరు: గజిబిజి విద్యుత్ తీగలకు.. విద్యుత్ తీగలు తెగిపడి జరిగే ప్రమాదాలకు చెక్ పడే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ దిశగా కర్ణాటకలోని బెంగళూరు పరిధిలో ఉన్న మల్లేశ్వరంలో తొలి అడుగు పడింది. దేశంలోనే మొదటిసారిగా ఇక్కడ భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రూ.1.97 కోట్లతో మల్లేశ్వరంలో ఏర్పాటుచేసిన భూగర్భ ట్రాన్స్ ఫార్మర్‌ను కర్ణాటక విద్యుత్తు శాఖ మంత్రి కేజే జార్జి ప్రారంభించారు.
భూగర్భ ట్రాన్స్ ఫార్మర్ ద్వారా 500 కిలోవాట్ల విద్యుత్‌ను సప్లై చేయొచ్చన్నారు. భూగర్భ విద్యుత్తు కేబుల్, ట్రాన్స్‌ఫార్మర్ వ్యవస్థ సురక్షితమని, విద్యుత్తు సరఫరాలో ఎలాంటి తేడా రాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బెంగళూరు సిటీలో భూగర్భంలో విద్యుత్ తీగలను అమర్చే పనులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు.