Bengal student leader: ఛాత్ర సమాజ్‌ నాయకుడికి బెయిల్‌

పశ్చిమబెంగాల్ ఛత్ర సమాజ్ నాయకులు సయన్ లాహిరికి కలకత్తా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-08-31 06:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్ ఛత్ర సమాజ్ నాయకులు సయన్ లాహిరికి కలకత్తా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోల్ కతా హత్యాచార ఘటనకు నిరసనగా ఆగస్టు 27న చలో సచివాలయం ర్యాలీ నిర్వహించారు. ఇది కాస్తా ఉద్రిక్తంగా మారింది. దీంతో ర్యాలీ నిర్వహించే వారిలో ఒకరైన పశ్చిమ బెంగాల్ ఛత్ర సమాజ్ నాయకుడు సయన్ లాహిరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 27 సాయంత్రం ఆయన్ని అరెస్టు చేశారు. ఇది హింసాత్మకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. లాహిరిపై విచారణను రద్దు చేసి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తల్లి దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. ఇకపోతే, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.

బలవంతపు చర్యలు తీసుకోవద్దు

కాగా.. కోర్టు అనుమతి లేకుండా లాహిరిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులు ఆదేశించారు. ఇకపోతే, సెప్టెంబరు 20లోగా పిటిషనర్‌ చేసిన అభ్యంతరాలకు వ్యతిరేకంగా అఫిడవిట్‌ దాఖలు చేయాలంది. అక్టోబరు 4లోగా పిటిషనర్‌ ఏదైనా సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఇకపోతే, పశ్చిమ బంగా ఛత్ర సమాజ్‌కు చట్టబద్ధమైన ఉనికి లేదని కోర్టు పేర్కొంది. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనతో ప్రజల మద్దతుతో ఈ సంఘం ఏర్పడిందంది. ట్రైనీ డాక్టర్ కు మద్దతుగా దేశమంతటా నిరసనలు వ్యాపించాయని మండిపడింది. ఆర్జీ కర్ సంఘటన జరగకపోతే పశ్చిమ బంగా ఛత్ర సమాజ్ ఉనికి ఉండేది కాదని కోర్టు పేర్కొంది.


Similar News