ముగింపునకు నాంది.. డాక్టర్ సందీప్ ఘోష్ అరెస్టుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు

కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్టు అయ్యారు.

Update: 2024-09-03 04:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్టు అయ్యారు. కాగా.. ఈ అరెస్టుపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. మాజీ ప్రిన్సిపల్ అరెస్టును ‘ముగింపునకు నాంది’ గా అభివర్ణించారు. హాస్పిటల్ లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు బెంగాల్ గవర్నర్ కు లేఖ రాశారు. తమ కుమార్తె మరణంపై త్వరితగతిన విచారణ జరగాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపైనే ఢిల్లీలో కేంద్రహోంమంత్రి అమిత్‌షాను గవర్నర్ ఆనంద బోస్ కలిశారు. అమిత్ షాతో భేటీ తర్వాతే డాక్టర్ సందీప్ ఘోష్ అరెస్టు జరగడం గమనార్హం. ఇకపోతే, ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన అక్రమాలపై ప్రిన్సిపల్‌ ఘోష్‌పై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే ఘోష్‌ను సోమవారం(సెప్టెంబర్‌2) సీబీఐ అరెస్టు చేసింది.


Similar News