Pakisthan : ఆ బెగ్గర్స్ ఇచ్చిన పార్టీ చూస్తే కళ్ళు తిరగాల్సిందే!
రోడ్లపై అడుక్కొని జీవించే ఓ కుటుంబం ఇచ్చిన విందు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.
దిశ, వెబ్ డెస్క్ : రోడ్లపై అడుక్కొని జీవించే ఓ కుటుంబం ఇచ్చిన విందు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అన్నిరకాల పదార్థాలతో ఏకంగా 20 వేల మందికి ఇచ్చిన భారీ విందు పార్టీ అందరూ నోరెళ్ళబెట్టేలా చేసింది. పాకిస్థాన్లోని గుజ్రాన్వాలాలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. ఒక బిచ్చగాడి నానమ్మ ఇటీవల మరణించడంతో 40వ రోజు స్మారకం సందర్భంగా అతడి కుటుంబం భారీ విందు ఏర్పాటు చేసింది. స్థానికులను, తెలిసినవారిని దీనికి ఆహ్వానించింది. గుజ్రాన్వాలాలోని రహ్వాలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ విందు కార్యక్రమం జరిగింది. పాకిస్థాన్లోని పంజాబ్ నలుమూలల నుంచి సుమారు 20,000 మంది విందుకు హాజరయ్యారు. సాంప్రదాయ వంటకాలతోపాటు అనేక రకాల మాంసాహార వంటకాలను వడ్డించారు. ఈ విందు కోసం సుమారు 250 మేకలు కోశారు. అలాగే అతిథులను తరలించేందుకు సుమారు 2,000 వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ భారీ విందు కోసం ఆ బెగ్గర్ ఫ్యామిలీ ఏకంగా రూ.1.25 కోట్లు ఖర్చు చేసిందని తెలిసి స్థానికులతోపాటు ధనవంతులు, కోటీశ్వరులు విభ్రాంతి చెందారు. కాగా ఒక బిచ్చగాడి కుటుంబం ఇంత విలాసవంతమైన విందు ఇవ్వడంపై కొందరు జోక్స్ వేయగా.. కొందరు వారి ఔదార్యాన్ని మెచ్చుకోగా.. చాలామంది మాత్రం వారి ఆర్థిక పరిస్థితిపై ఆశ్చర్యపోయారు. ఈ విందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.