బీ అలర్ట్.. భారత వాతావరణ శాఖ కీలక స్టేట్‌మెంట్

దేశ వ్యాప్తంగా చలి గాలులు, పొగమంచు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది.

Update: 2024-01-08 04:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా తీవ్రంగా చలి గాలులు, పొగమంచు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రంగా పెరిగి అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా దట్టమైన పొగ మంచు ఏర్పతుందని పేర్కొంది. ఇక రాబోయే రెండు రోజుల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ రాజస్థాన్‌లలో సాధారణ చలి కంటే తీవ్రంగా చలిగాలులు వీచే అవకాశం ఉందంటూ ప్రజలకు హెచ్చరించింది. ఇక జనవరి 8 నుంచి 10 తేదీల్లో రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఉరుములు లేదా వడగళ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు వాతావరణ శాఖ శాటిలైట్ పిక్చర్ విడుదల చేయగా.. అందులో పంజాబ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్‌లోని వివిధ ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కమ్ముకున్నట్లుగా ఉన్నాయి. 

Tags:    

Similar News