ఎస్బీఐకి రూ.95 కోట్ల కుచ్చుటోపి పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఈడీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఓ వ్యక్తి ఏకంగా రూ. 95 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. దీంతో కోల్‌కతాకు చెందిన... Bank Loan Fraud: Kolkata Man Arrested By Probe Agency For "Cheating" SBI For ₹ 95 Crore
కోల్‌కతా: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఓ వ్యక్తి ఏకంగా రూ. 95 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. దీంతో కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్తను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం తెలిపింది. గత నెల 30 వ్యాపారి కౌశిక్ కుమార్ నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. నకిలీ, కల్పిత పత్రాలను సమర్పించి రుణాన్ని పొందినట్లు నాథ్ తెలిపారు. రుణాల పేరుతో తీసుకున్న డబ్బులను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించనట్లు వెల్లడించారు. అయితే బ్యాంకులు తన గుర్తింపు మారుస్తూ బ్యాంకుల మోసగించినట్లు ఈడీ తెలిపింది. తాజాగా ముంబైకి మారి ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో నాథ్‌కు చెందిన రూ.3.68 కోట్ల స్థిరాస్తులను జప్తు చేసినట్లు పేర్కొంది.