BSF : బార్డర్‌లో బీఎస్ఎఫ్ కాల్పులు.. బంగ్లాదేశీ స్మగ్లర్ హతం

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశీ స్మగ్లర్లు భారత బార్డర్‌లో బరితెగిస్తున్నారు. భారత్‌కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బందిపైనే దాడికి తెగబడుతున్నారు.

Update: 2024-08-12 18:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశీ స్మగ్లర్లు భారత బార్డర్‌లో బరితెగిస్తున్నారు. భారత్‌కు చెందిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బందిపైనే దాడికి తెగబడుతున్నారు. తాజాగా అలాంటిదే ఓ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఉన్న భారత్ - బంగ్లాదేశ్ బార్డర్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ బార్డర్ ఏరియాలోని చాందినీ చౌక్ బార్డర్ ఔట్‌పోస్ట్ వద్ద 115వ బీఎస్ఎఫ్ బెటాలియన్ పహారా విధులు నిర్వర్తిస్తోంది. అసలేం జరిగిందంటే.. మాల్దా జిల్లాలోని భారత్ - బంగ్లాదేశ్ బార్డర్‌‌కు దాదాపు 4.5 కి.మీ దూరంలో బంగ్లాదేశ్ పరిధిలో రిషిపారా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన అబ్దుల్లా సహా దాదాపు ఐదారుగురు కలిసి బీడీ ఆకు స్మగ్లింగ్ చేస్తుండేవారు. వీరంతా కలిసి సోమవారం తెల్లవారుజామున ఎలాగోలా బంగ్లాదేశ్ సెక్యూరిటీని దాటుకొని భారత్‌లోకి ప్రవేశించారు. మాల్దా జిల్లాలోని చాందినీ చౌక్ బార్డర్ ఔట్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు.

బీడీ ఆకుల ఆరు బండిల్స్ పట్టుకొని ఔట్‌పోస్ట్‌ను దాటుతుండగా భారత బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. వారిని ఆగిపొమ్మని హెచ్చరించారు. అయినా వారు ఆగలేదు. దీంతో ఓ బీఎస్ఎఫ్ జవాను కాల్పులు జరపగా అబ్దుల్లా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ముర్షీదాబాద్‌లోని మెహ్‌సిల్‌లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయాడు. బార్డర్ వద్ద ఆగమన్నందుకు స్మగ్లర్లు పదునైనా ఆయుధాలతో దాడికి యత్నించారని.. దీంతో ఆత్మరక్షణార్ధం వారిపై బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరపాల్సి వచ్చిందని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు దళం ప్రకటించింది. వెంటనే దీనిపై బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్‌ (బీజీబీ)కు చెందిన అధికారులకు భారత్ సమాచారాన్ని అందించింది. ఇక సంఘటనా స్థలం నుంచి బీడీ ఆకుల ఆరు బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News