Taslima Nasreen : భారత్‌లోనే ఉంటాను.. అనుమతించండి : తస్లీమా నస్రీన్

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ భారత్‌‌ను తన రెండో పుట్టినింటిగా అభివర్ణించారు.

Update: 2024-10-21 13:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ భారత్‌‌ను తన రెండో పుట్టినింటిగా అభివర్ణించారు. భారత్‌ను తాను ప్రేమిస్తానని, ఇక్కడ నివసించే అవకాశాన్ని తనకు కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరుతూ ఆమె ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. గత 20 ఏళ్లుగా తనకు సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తూ రెండో పుట్టినింటిగా భారత్ నిలుస్తోందని తస్లీమా గుర్తు చేశారు.

అయితే తన నివాస అనుమతుల గడువును జులై 22 నుంచి భారత హోంశాఖ పొడిగించకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోందని ఆమె చెప్పారు. తన రెసిడెన్స్ పర్మిట్‌‌ను పొడిగిస్తే సంతోషిస్తానన్నారు. ‘లజ్జ’ టైటిల్‌తో తస్లీమా నస్రీన్ రచించిన నవల వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్‌లోని మతఛాందస వాదుల నుంచి ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో తస్లీమా 1994లో భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. 


Similar News