Bangladesh : బంగ్లా తిరుగుబాటు భారత పాలకులకు పాఠం : మెహబూబా ముఫ్తీ
దిశ, నేషనల్ బ్యూరో : నియంతృత్వ పాలన ఎక్కడ కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగదని కశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : నియంతృత్వ పాలన ఎక్కడ కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగదని కశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలు భారత పాలకులకు పాఠం లాంటివని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘యువతను అణచివేస్తే తిరుగుబాటు తప్పక వస్తుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయకుండా, నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా, ప్రజలను విద్యకు దూరం చేయాలని చూస్తే బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు భారత్‌లోనూ తలెత్తుతాయి’’ అని ముఫ్తీ కామెంట్ చేశారు.
‘‘నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారు. అలాంటప్పుడు షేక్ హసీనా ఎదుర్కొన్న చేదు అనుభవాన్నే భారత పాలకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు.‘‘బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు ప్రస్తుతం కశ్మీర్‌లో కూడా ఉన్నాయి. యూఏపీఏ, పీఎస్ఏ లాంటి చట్టాలతో కశ్మీరీ యువత విసిగివేసారారు. బంగ్లాదేశ్ తరహా తిరుగుబాటు కశ్మీర్‌లో జరగకూడదని నేను కోరుకుంటున్నాను’’ అని పీడీపీ చీఫ్ చెప్పుకొచ్చారు.