జేకేఎల్ఎఫ్‌పై మరో ఐదేళ్లు నిషేధం: కేంద్ర హోం శాఖ నిర్ణయం

ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు చెందిన వేర్పాటు వాద సంస్థ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్‌) సంస్థపై కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.

Update: 2024-03-16 06:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు చెందిన వేర్పాటు వాద సంస్థ జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్‌) సంస్థపై కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అంతేగాక జమ్మూ కశ్మీర్ పీపుల్స్ లీగ్‌లోని నాలుగు విభాగాలను సైతం బ్యాన్ చేసింది. అందులో జేకేపీఎల్ (ముక్తార్ అహ్మద్ వాజా), జేకేపీఎల్ (బషీర్ అహ్మద్ తోట), జేకేపీఎల్ (గులాం మహమ్మద్ ఖాన్), యాకూబ్ షేక్ నేతృత్వంలోని జేకేపీఎల్‌(అజీజ్ షేక్)లను నిషేధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు. పై సంస్థలన్నీ జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతలను ఎవరైనా సవాల్ చేస్తే చట్టపరంగా కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉగ్ర వాదాన్ని అణచి వేయడంలో మోడీ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలను చట్టవిరుద్ధమైన సంస్థలుగా ప్రకటిస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లను కూడా అమిత్ షా షేర్ చేశారు. కాగా, జేకేఎల్ఎఫ్ ను కేంద్ర 2019లో బ్యాన్ చేసింది. తాజగా గడువు ముగియడంతో మరో ఐదేళ్లు నిషేధం విధించింది. ఈ సంస్థ చీఫ్ యాసిన్ మాలిక్ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 

Tags:    

Similar News