అమిత్ షాతో భేటీపై బజరంగ్ పునియా కీలక వ్యాఖ్యలు!

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాము ఎలాంటి డీల్ కుదుర్చుకోలేదని రెజ్లర్ల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న బజరంగ్ పునియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-06 12:32 GMT
అమిత్ షాతో భేటీపై బజరంగ్ పునియా కీలక వ్యాఖ్యలు!
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాము ఎలాంటి డీల్ కుదుర్చుకోలేదని రెజ్లర్ల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న బజరంగ్ పునియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా భేటీ అనంతరం రెజ్లర్లు తిరిగి రైల్వే విధుల్లో చేరడంపై వారు తమ ఆందోళన విరమించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బజరంగ్ పునియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అమిత్ షాతో తమ భేటీకి సంబంధించిన సమాచారం బయట పెట్టవద్దని ప్రభుత్వం తమను కోరిందని అయితే తామే ఆ సమాచారాన్ని మీడియాకు లీక్ చేశామని చెప్పారు. అమిత్ షా భేటీ అనంతరం ఇక నిరసనలు చేయడం వల్ల ప్రయోజనం లేదనే నిర్ణయానికి రెజ్లర్లు వచ్చారనే ప్రచారంపై స్పందిస్తూ తమ నిరసన కంటిన్యూ అవుతుందని చెప్పారు. ప్రభుత్వ ప్రతిస్పందనతో అథ్లెట్లు సంతృప్తి చెందలేదని మా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం లేదని అందువల్ల తమ ఆందోళనను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై మేము వ్యూహరచన చేస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News