Bajrang Punia : వినేష్ ఓడినందుకు ఆనందపడే వాళ్లు దేశభక్తులా ? : బజ్రంగ్ పునియా

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘రెజ్లర్ వినేష్ ఫోగట్‌‌పై ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడి మంచిపనైంది’’ అంటూ బీజేపీ నేత, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బజ్రంగ్ పునియా మండిపడ్డారు.

Update: 2024-09-07 10:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘రెజ్లర్ వినేష్ ఫోగట్‌‌పై ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడి మంచిపనైంది’’ అంటూ బీజేపీ నేత, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బజ్రంగ్ పునియా మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ మెంటాలిటీ ఎలాంటిదో ఆయన కామెంట్స్‌ను విని ఈజీగా అర్థం చేసుకోవచ్చన్నారు. ‘‘ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ కోల్పోయింది వ్యక్తిగత మెడల్ కాదు. అది 140 కోట్ల మంది భారతీయులకు దక్కాల్సిన మెడల్. దేశం కోసం ఒలింపిక్స్‌లో పాల్గొన్న వినేష్ ఓటమిని చూసి బ్రిజ్ భూషణ్ సంతోషిస్తుండటం బాధాకరం’’ అని బజ్రంగ్ పునియా పేర్కొన్నారు.

‘‘వినేష్ ఫోగట్ ఓటమిని చూసి ఆనందపడే వాళ్లు దేశభక్తులా ? మేమంతా చిన్నప్పటి నుంచే దేశం తరఫున పోటీల్లో పాల్గొంటున్నాం. మాకా మీరు దేశభక్తిని నేర్పించేది’’ అని ఆయన ప్రశ్నించారు. దేశంలో బాలికలపై లైంగిక వేధింపుల పాల్పడుతున్న వాళ్లలో బీజేపీ నేతలు కూడా ఉంటున్నారన్నారు. ‘‘వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ ఫైనల్స్‌కు క్వాలిఫై అయిందని తెలిసి యావత్ దేశం సంతోషించింది. ఆ మరుసటి రోజే ఆమెపై అనర్హత వేటు పడిందని తెలిసి దేశమంతా ఆవేదనకు లోనైంది. కానీ ఒక పార్టీ ఐటీ సెల్ మాత్రం తెగ ఆనందపడిపోయింది’’ అని బజ్రంగ్ పునియా బీజేపీపై విమర్శలు గుప్పించారు. 


Similar News