HMPV: చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్.. బెంగళూరు ఆస్పత్రిలో గుర్తింపు

బెంగళూరులో హెచ్ఎంపీవీ(HMPV) వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఎనిమిది నెలల పాపకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకింది. బెంగళూరులోని(Bengaluru hospital) ప్రైవేటు ఆస్పత్రిల ఈ కేసు వెలుగు చూసింది.

Update: 2025-01-06 04:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులో హెచ్ఎంపీవీ(HMPV) వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఎనిమిది నెలల పాపకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకింది. బెంగళూరులోని(Bengaluru hospital) ప్రైవేటు ఆస్పత్రిల ఈ కేసు వెలుగు చూసింది. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌లో శాంపిల్‌ను పరీక్షించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. "రిపోర్టులు ప్రైవేట్ ఆస్పత్రి నుండి వచ్చాయి. ఆ పరీక్షలపై మాకు ఎటువంటి సందేహం లేదు" అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. చైనాలో ప్రబళిన ఈ వైరస్ గురించి సరైన సమాచారం లేదని వెల్లడించింది.

హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ లక్షణాలు

2001లోనే గుర్తించిన హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ ని గుర్తించారు. ఆ వైరస్ లక్షణాలు (HMPV virus Symptoms) ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశాలు ఎక్కువ అని పేర్కొంది. ఈ వ్యాప్తిని నిరోధించడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. అనారోగ్యంతో ఉన్నవారితో కాంటాక్ట్ లో ఉండొద్దని డాక్టర్ల సూచించారు.

Tags:    

Similar News