అమెరికా యూనివర్సిటీలో.. పాలస్తీనా ‘ఆజాదీ’ నినాదాల హోరు

కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ లోని పాలస్తీనా అనుకూల నిరసనలకు కేంద్రంగా మారింది. ఈ వారంలోనే దాదాపు ఐవీ యూనివర్సిటికీ చెందిన 108 నిరసనకారులను అరెస్టు చేశారు పోలీసులు.

Update: 2024-04-21 14:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ లోని పాలస్తీనా అనుకూల నిరసనలకు కేంద్రంగా మారింది. ఈ వారంలోనే దాదాపు ఐవీ యూనివర్సిటికీ చెందిన 108 నిరసనకారులను అరెస్టు చేశారు పోలీసులు. అయినప్పటికీ అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొలంబియా యూనివర్శిటీ క్యాంపస్‌లోనూ అదే రచ్చ జరుగుతోంది 'అజాదీ' (స్వేచ్ఛ) నినాదాలు వినిపిస్తున్న వీడియో సోషల్ మీడియా ఎక్స్ లో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఓ మహిళ పాలస్తీనాకు అనుకూలంగా హిందీలో నినాదాలు చేశారు. ఆమెతో ఉన్న నిరసనకారులు ఆజాదీ అని కోరస్ లో నినాదాలు చేస్తున్నారు. “అరే హమ్ క్యా చాహతే, ఆజాదీ... పాలస్తీనా కీ, ఆజాదీ... అరే ఛీన్ కే లేంగే, ఆజాదీ... హై హక్ హమారా, ఆజాదీ... (మనకేం కావాలి... స్వేచ్ఛ... పాలస్తీనా స్వేచ్ఛ.. మా హక్కు అయిన స్వాతంత్ర్యాన్ని సాధిస్తాం...)," అని వీడియోలో ఆ మహిళ నినాదాలు చేసింది. భారతీయ సంతతికి చెందిన మహిళగా కనిపించిన ఆమె.."బైడెన్ సున్లే, ఆజాదీ.... నెతన్యాహు సున్లే, ఆజాదీ... మోడీ సన్లే, ఆజాదీ( బైడెన్ వినండి,ఆజాదీ.. నెతన్యాహూ వినండి, ఆజాదీ.. మోడీ వినండి, ఆజాదీ)" అంటూ నినాదాలు చేసింది.

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనూ అనేక సందర్భాల్లో ఇలాంటి 'ఆజాదీ' నినాదాలు లేవనెతాతరు. ముఖ్యంగా 2016లో పార్లమెంట్‌ పై దాడి జరిగిన కేసులో ప్రమేయం ఉన్న కశ్మీరీ వేర్పాటువాది అఫ్జల్ గురును ఉరితీసినప్పుడు వామపక్షవాద విద్యార్థులు నిరసనలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో తీవ్రవాదం అధికమైన టైంలోనూ ఇలాంటి నిరసనలు చెలరేగాయి.

అంతకుముందు, కొలంబియా యూనివర్సిటీ క్యాంపస్ నుండి కనీసం 108 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. నిరసనలో పాల్గొన్న పలువురు విద్యార్థులను కొలంబియా యూనివర్సిటీ బర్నార్డ్ కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు అధికారులు. ఈ నిరసనకారుల్లో వివాదాస్పద డెమొక్రాట్ నాయకుడు ఇల్హాన్ ఒమర్ కుమార్తె ఇస్రా హిర్సీ కూడా ఉన్నారు.


Similar News