Australia: 7000 మంది పాలస్తీనియన్ల వీసాలు తిరస్కరించిన ఆస్ట్రేలియా

ఆశ్రయం కోసం ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాలకు వెళ్లే పాలస్తీనియన్ల సంఖ్య పెరిగింది.

Update: 2024-08-16 17:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-గాజా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా 40 వేల మందికి పైగా మరణించారు. గతేడాది అక్టోబర్ నుంచి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై చరిత్రలోనే ఘోరమైన దాడి చేసింది. దీని ఫలితంగా వేలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. వారిలో కొందరు శరణార్థులుగా ఆశ్రయం కోసం పలు దేశాలకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తాజా నివేదికల ప్రకారం, ఆశ్రయం కోసం ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాలకు వెళ్లే పాలస్తీనియన్ల సంఖ్య పెరిగింది. కానీ, ఆస్ట్రేలియాలో నిరాశ్రయానికి వారి వీసాలు తిరస్కరించబడుతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెలీల వీసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియా వివరాలను బట్టి.. గత పది నెలల్లో 10,033 దరఖాస్తుల్లో 7,111 వీసాలను తిరస్కరించారు. 2,922 మంది పాలస్తీనియన్లకు అనుమతి లభించిందని ఆ దేశ హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ ధృవీకరించారు. ఇదే సమయంలో 2023, అక్టోబర్ 7 దాడుల తర్వాత నుంచి 8,746 మంది ఇజ్రయెల్ పౌరులు వీసాలకు అనుమతి లభించిందని, 235 మాత్రమే తిరస్కరించబడ్డాయని పేర్కొన్నారు. 

Tags:    

Similar News