Karnataka: కర్ణాటకలో ఔరంగజేబు పోస్టర్లు కలకలం

కర్ణాటకలోని(Karnataka) బెలగావిలో(Belagavi) ఔరంగజేబ్(Mughal ruler Aurangzeb) పోస్టర్లు కలకలం రేపాయి.

Update: 2024-11-05 11:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని(Karnataka) బెలగావిలో(Belagavi) ఔరంగజేబ్(Mughal ruler Aurangzeb) పోస్టర్లు కలకలం రేపాయి. షాహు నగర్ ప్రాంతంలో ఔరంగజేబ్ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు పెట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఔరంగజేబ్‌ని ‘‘సుల్తాన్-ఏ-హింద్’’, ‘‘అఖండ భారత్ నిజమైన స్థాపకుడు’’ అని అభివర్ణిస్తూ పోస్టర్లు వెలిశాయి. అయితే, ఈ పోస్టర్లు స్థానికంగా ఉద్రిక్తత కలిగించాయి. స్థానికుల నిరసన మధ్య బ్యానర్లను తీసివేసి, ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు. ఈ బ్యానర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన బాధ్యులపై తర్వగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో విమర్శలు

ఇదిలా ఉంటే, బ్యానర్లను తీసివేయడంపై మరో వర్గానికి చెందిన యువకులు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు. పక్కనే ఉన్న వీర్ సావర్కర్ బ్యానర్‌ని తీయకుండ, ఔరంగజేబ్ బ్యానర్లను తీసేయడం ఏంటని ప్రశ్నించారు. ఔరంగాజేబ్ బ్యానర్లను తీసేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై, బెలగావి లా అండ్ ఆర్డర్ డిప్యూటీ కమిషనర్ రోహన్ జగదీష్ ప్రకటన విడుదల చేశారు. ‘‘నవంబర్ 3 ఔరంగజేబ్ పుట్టిన రోజున కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా పబ్లిక్ ఆస్తులపై పోస్టర్లు అంటించారు. కార్పొరేషన్ వీటిని తొలగించింది’’ అని పేర్కొన్నారు.


Similar News