భారత ఎన్నికల్లో చైనా జోక్యానికి ప్రయత్నాలు.. ఇప్పటికే ఆ దేశంలో ట్రయల్ రన్ పూర్తి.. హెచ్చరించిన మైక్రోసాఫ్ట్
భారత దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
దిశ, డైనమిక్ బ్యూరో:భారత దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. అలాగే అమెరికా, దక్షిణ కోరియాలో జరగోనున్న ఎన్నికలలోనూ ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జనరేట్ చేసిన కంటెంట్ తో అందరిని తప్పుదోవ పట్టించాలని చూస్తోందని స్పష్టం చేసింది. ఇటీవల తైవాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా ఈ మేరకు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసిందని ఇప్పటికే కొన్ని నివేదికలు వచ్చిన నేపథ్యంలో భారత్ లో జరగబోయే ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోబోతున్నదన్న R హెచ్చరికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది యూరోపియన్ యూనియన్‌తో పాటు కనీసం 64 దేశాలు జాతీయ ఎన్నికలు జరగబోతున్నాయి. . ఈ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 49 శాతం వాటా కలిగి ఉన్నాయి. కాగా గత నెలలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువురు సామాజిక కారణాలు, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయంలో ఆవిష్కరణల కోసం ఏఐ వినియోగం గురించి చర్చించారు.