Ramesh Bidhuri : అతిషి తండ్రినే మార్చేసింది..మరోసారి రమేష్ బిధూరి వివాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం(Kalkaji in Delhi Assembly Elections) నుంచి సీఎం అతిషిCM Atishiపై పోటీ చేస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి(BJP MLA Candidate Ramesh Bidhuri)మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు(Controversial Comments)చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం(Kalkaji in Delhi Assembly Elections) నుంచి సీఎం అతిషిCM Atishiపై పోటీ చేస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి(BJP MLA Candidate Ramesh Bidhuri)మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు(Controversial Comments)చేశారు. తాజాగా కల్కాజీ రోడ్లను కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ బుగ్గల మాదిరి నిర్మిస్తానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన ఘటన మరువకముందే సీఎం అతిషిపై నోరుపారేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి ఇంటిపేరు మార్లెనా నుంచి సింగ్‌గా మారిందని, ఆమె తన తండ్రినే మార్చేసిందంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
అవినీతి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోనన్న ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఇండియా కూటమి భాగస్వామిగా ఎలా కొనసాగుతున్నారంటూ నిలదీశారు. అలాగే భారత సైనికుల మరణానికి కారణమైన ఉగ్రవాది అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టాలని అతిషి మర్లెనా తల్లిదండ్రులు పిటిషన్ వేసిన సంగతిని రమేష్ బిధూరి గుర్తు చేస్తూ అలాంటి వారికి ఢిల్లీ ప్రజలు మద్దతివ్వాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ప్రధాని నరేంద్ర మోడీ వరుస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో కూడిన ప్రచార సభలు కొనసాగిస్తుండగా.. రమేష్ బిధూరి మాత్రం తన వివాదస్పద వ్యాఖ్యలతో ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నారు. వెడేక్కించాయి.