సంచలనం: ముఖ్యమంత్రిపై పోటీకి సిద్ధమైన బాబా
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది మధ్యప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ ఎన్నికలు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు పెను సవాలుగా మారుతున్నాయి. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న బీజేపీ
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది మధ్యప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ ఎన్నికలు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు పెను సవాలుగా మారుతున్నాయి. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టి ఉత్తరాదిన తమకు తిరుగులేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంటే, మూడు సంవత్సరాల క్రితం తమ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీపై బదులు తీర్చుకోవాలనే గట్టి సంకల్పంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పథకాలు, ప్రధాన నరేంద్ర మోడీ చరిష్మాతో గట్టెకుతామని బీజేపీ ఆశలు పెట్టుకుంటే, ప్రభుత్వ వ్యతిరేకత తమను అందలమెక్కిస్తుందనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. అయితే, ఇదిలా ఉండగా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సొంత నియోజకవర్గంలో ఆసక్తికర పోరు కనిపిస్తోంది. బుద్నీ పోరు ఈసారి దేశ ప్రజలను ఆకర్షిస్తోంది.
సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కంచుకోటపై సమాజ్‌వాదీ పార్టీ గురిపెట్టింది. మామ సీఎంపై పోటీకి మిర్చి బాబాను రంగంలోకి దింపుతుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఫైట్ టగ్ఆఫ్ వార్‌గా నడువనున్నాయి. మిర్చి బాబా అసలు పేరు రాకేశ్ దుబే. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా బిర్ఖడిలో ఓ పూజారి దంపతులకు జన్మించారు. 1997 వరకు ఓ నూనె మిల్లులో పనిచేసిన రాకేశ్ దుబే.. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి నష్టాలపాలయ్యారు. తర్వాత గుజరాత్ అహ్మదబాద్ వెళ్లి ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో చేరారు. కొంతకాలం తర్వాత అక్కడే సన్యాసం స్వీకరించి తన పేరును వైరాగ్యనంద గిరిగా మార్చుకున్నారు. బాబాగా మారిన తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ భగవద్గీత బోధిస్తూ తన వద్దకు వచ్చే భక్తులకు ప్రసాదంగా కారం పొడిని ఇచ్చి ఫేమస్ అయ్యారు. దీంతో ఆయన మిర్చి బాబాగా పేరుగాంచారు. దీంతో బుద్నీ స్థానం నుంచి ఆయన్ను బరిలోకి దించుతూ ఎస్పీ.. అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.