Assam gangrape:అసోం గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు మృతి

అసోం బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మరో పరిణామం జరిగింది. ప్రధాన నిందితుడు తఫజుల్ ఇస్లాంను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం దర్యాప్తులో భాగంగా అతడిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.

Update: 2024-08-24 06:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోం బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మరో పరిణామం జరిగింది. ప్రధాన నిందితుడు తఫజుల్ ఇస్లాంను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం దర్యాప్తులో భాగంగా అతడిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. క్రైం సీన్ లో దర్యాప్తు చేస్తుండగా నిందితుడు ప్రాణభయంతో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగానే చెరువులోకి దూకాడు. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి నిందితుడిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. రెండు గంటల తర్వాత రెస్క్యూ బృందం నిందితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.

నాగావ్ జిల్లాలో దారుణం

అసోంలోని నాగావ్‌ జిల్లాకు చెందిన బాలిక(14) ట్యూషన్‌ సైకిల్ పై ట్యూషన్ కి వెళ్లివస్తుండగా ఆమెపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు దగ్గరకు లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు గమనించి హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం నాగావ్ జిల్లాలోని ఆస్పత్రిలో బాలిక చికిత్స పొందుతుంది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసి.. మహిళలు, బాలికలకు భద్రత కల్పించాలని భారీగా నిరసనలు జరిగాయి. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సిబామోని బోరా, ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంతో సహా స్థానిక రాజకీయ నాయకులు ఈ ఘటనను ఖండించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


Similar News