Rajya Sabha : ఎన్నిక లేకుండానే బీజేపీకి మరో రెండు రాజ్యసభ స్థానాలు

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ అసోంలో రెండు రాజ్యసభ సీట్లను ఎలాంటి పోటీ లేకుండానే గెల్చుకుంది.

Update: 2024-08-26 17:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ అసోంలో రెండు రాజ్యసభ సీట్లను ఎలాంటి పోటీ లేకుండానే గెల్చుకుంది. ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల కోసం ఇద్దరు బీజేపీ అభ్యర్థులు (రామేశ్వర్ తేలి, మిషన్ రంజన్ దాస్) మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. దీంతో రాజ్యసభ ఎన్నికల బరిలో వాళ్లిద్దరే మిగిలారు.

దీంతో రామేశ్వర్ తేలి, మిషన్ రంజన్ దాస్‌లు రాజ్యసభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రాజీవ్ భట్టాచార్య ప్రకటించారు. దేశంలోని 9 రాష్ట్రాల పరిధిలో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ సీట్ల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ వెలువడింది. రెండు రాజ్యసభ స్థానాలు బీజేపీ ఖాతాలో చేరిపోవడంతో మిగతా 10 స్థానాలకు సెప్టెంబరు 3న ఎన్నిక జరగనుంది.


Similar News