అద్భుతమైన పాలరాతి కట్టడం.. తాజ్ మహల్ కాదు.. ఇంతకీ ఏంటంటే?
ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్ మహల్ కట్టడానికి పోటీగా మరో కట్టడం వచ్చి చేరింది. రాధాస్వామి ఆధ్యాత్మిక సంప్రదంలో నడిచిన శివ్ దయాళ్ సింగ్ పాలరాతి సమాధి చూపరులను ఆకట్టుకుంటోంది.
దిశ, నేషనల్ బ్యూరో: ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్ మహల్ కట్టడానికి పోటీగా మరో కట్టడం వచ్చి చేరింది. రాధాస్వామి ఆధ్యాత్మిక సంప్రదంలో నడిచిన శివ్ దయాళ్ సింగ్ పాలరాతి సమాధి చూపరులను ఆకట్టుకుంటోంది. తాజ్ మహల్ కు 12 కిలోమీటర్ల దూరంలోని స్వామి బాగ్ కాలనీలో ఈ సమాధి ఉంది. దీన్ని నిర్మించేందుకు వందేళ్లకు పైగా కష్టపడ్డారు.
1904లో శివ్ దయాళ్ సింగ్ సమాధి నిర్మాణపనులు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల అవి నిలిచిపోయాయి. 1922లో ఆ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ నిర్మణానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. శివ్ దయాళ్ సింగ్ సమాధిని చూసేందుకు ఆధ్యాత్మిక పర్యటకులు వెల్లువెత్తుతున్నారు. అయితే, ఈ కట్టడానికి.. తాజ్ మహల్ కు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. రాజస్థాన్ లోని మక్రానా, జోథ్ పూర్ ప్రాంతాల నుంచి పాలరాతిని తీసుకొచ్చి ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. దాదాపు 193 అడుగుల ఎత్తులో ఈ అందమైన కట్టడాన్ని నిర్మించారు.