AAP: పూజారులకు రూ.18 వేలు వేతనంగా ఇస్తాం- మరో సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పని చేసే పూజారుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వారికి నెలకు రూ.18వేలు గౌరవ వేతనంగా అందజేస్తామని పేర్కొన్నారు. ‘‘వారు పురాతన ఆచారాలను భవిష్యత్ తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ వారి ఆర్థికస్థితిని ఎవరూ పట్టించుకోవట్లేదు’’ అని ఈ సందర్భంగా కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ఈ స్కీం కోసం రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు. హనుమాన్ ఆలయంలో తానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తానని చెప్పారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంతరాలు కలిగించొద్దని బీజేపీని కోరారు. ఈ పథకాన్ని అడ్డుకోవడం అంటే పాపం చేసినట్లే అవుతుందని అన్నారు. వారు, దేవునికి మధ్య వారధిగా ఉంటారని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Election) ఆప్ విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఉన్నారు. అధికారంలోకి వస్తే.. వృద్ధుల కోసం సంజీవని స్కీమ్, మహిళా సమ్మాన్ యోజన (పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి మహిళకు నెలనెలా రూ.2,100 ఆర్థికసాయం), ఇప్పుడు అర్చకులకు గౌరవ వేతనం వంటి హామీలు ఇచ్చారు. ఢిల్లీలో రోహింగ్యా ఓటర్ల ఆరోపణలపై కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. “డ్రామాలు ఆపి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని అరెస్టు చేయండి. రోహింగ్యాలను ఎవరు, ఎక్కడ పునరావాసం కల్పించారనే వివరాలు అతని వద్ద ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Read More..
Actor-politician Vijay: భద్రత కోసం ఎవరిని అడగాలి?.. డీఎంకేపై విజయ్ విమర్శలు