కాంగ్రెస్‌తో డీల్ ఫిక్స్.. ఆ రాష్ట్రంలో ఇరుపార్టీల ‘సోలో’ ఫైట్ : కేజ్రీవాల్
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన విడుదల చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన విడుదల చేశారు. పంజాబ్‌లోని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు వేటికవి ఒంటరిగా పోటీ చేసేందుకు పరస్పరం అంగీకరించాయని ఆయన వెల్లడించారు. ఈవిషయంలో పూర్తి క్లారిటీతో రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఆదివారం కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఇంట్లో భోజనానికి వెళ్లారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆప్, కాంగ్రెస్‌లు విడివిడిగా పోటీ చేసినంత మాత్రాన ఇరుపార్టీల మధ్య ఎలాంటి శత్రుత్వ భావన ఏర్పడదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో లోక్‌సభ సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నామని ఆప్ చీఫ్ తెలిపారు. ఒకవేళ ఢిల్లీలోనూ తమ రెండు పార్టీల పొత్తు లేకుంటే బీజేపీ చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతుందని సెటైర్ వేశారు.