అరుణాచల్‌ల్లో 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' ప్రారంభించిన సీఎం (వీడియో)
సెప్పా నుండి చయాంగ్ తాజో వరకు ఈ సేవలను అందించనుంది. First drone-based healthcare services 'Medicine from the sky.'
దిశ, వెబ్‌డెస్క్ః భారతదేశ 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా, ఆగస్టు 15న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన మొదటి డ్రోన్ సేవ, 'మెడిసిన్ ఫ్రమ్ ది స్కై'ను ప్రారంభించింది. మొదటి దశగా సెప్పా నుండి చయాంగ్ తాజో వరకు ఈ సేవలను అందించనుంది. కాగా, ఈ ప్రాజెక్ట్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సహకారంతో ప్రారంభించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచ డ్రోన్ హబ్‌గా మార్చాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆశయంతో ఈ ప్రాజెక్ట్ ప్రేరణ పొందిందని సీఎం తెలిపారు.
Successful launch of the first flight of drone service - 'medicine from the sky' from Seppa to Chayang Tajo in East Kameng district. @PMOIndia @MoHFW_INDIA pic.twitter.com/hIK1XpIIAf
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) August 15, 2022
1984లో అదృశ్యమైన సైనికుడి మృత దేహాన్ని కనుగొన్న భారత్ ఆర్మీ!