Terrorist Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఆర్మీ అధికారి మృతి
జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో ఉగ్రదాడు(Terrorist Attack)లు ఆగడం లేదు. కొద్ది రోజులుగా కాల్పుత మోతతో కశ్మీర్ అట్టుడుకుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లో ఉగ్రదాడు(Terrorist Attack)లు ఆగడం లేదు. కొద్ది రోజులుగా కాల్పుత మోతతో కశ్మీర్ అట్టుడుకుతోంది. తాజాగా.. కిష్త్వార్ జిల్లాలో భద్రతా బలగాలు(Security Forces), ఉగ్రవాదుల(Terrorists) మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ అధికారి(Army officer) మృతిచెందగా.. ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతిచెందిన అధికారి సెకండ్ పారా(స్పెషల్ ఫోరెన్స్) రెజిమెంట్‌కు చెందిన నాయిబ్ సుబేదార్ రాకేశ్ కుమార్‌గా గుర్తించారు. ఇటీవల ఇద్దరు విలేజ్డిఫెన్స్గార్డు(వీడీజీ)లను చంపిన ఉగ్రవాదుల కోసం చేపట్టిన ఆపరేషన్కొనసాగుతోంది.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కేశ్వాన్అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీకి ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, సైనికులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఇద్దరు వీడీజీల మృతదేహాలు లభ్యమైన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిగాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.