మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన సైనికుల బస్సు

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్యేక సాయుధ దళాల (ఎస్‌ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు, కారును ఢీకొట్టి బోల్తాపడింది.

Update: 2024-04-06 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్యేక సాయుధ దళాల (ఎస్‌ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు, కారును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఒక జవాన్ తీవ్రంగా గాయపడగా అతన్ని చికిత్స కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించినట్లు అధికారి తెలిపారు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని-మండ్లా రాష్ట్ర రహదారిపై ధనగధ గ్రామ సమీపంలో తెల్లవారుజామున 1 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కన్హయ్య జస్వానీ (75), నిక్లేష్ జస్వానీ (45), డ్రైవర్ పురుషోత్తం మహోబియా (37) మృతి చెందగా, గాయపడిన మరో ఇద్దరు కారు ప్రయాణికులు కియోలారి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన జవాన్లను కూడా మెరుగైన చికిత్స కోసం కియోలారి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.


Similar News