'That is Modi'... తల్లి చనిపోయిన బాధలోను కర్తవ్య బాధ్యతలు మరవలేదు

కన్నతల్లిని కోల్పోయిన బాధలోను నరేంద్రమోడీ దేశ ప్రధానిగా తన కర్తవ్య బాధ్యతలు మరువలేదు. బాధలో ఉన్నా సరే... తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా బంగాల్‌లో మొదటి వందే భారత్ ఎక్స్​ప్రెస్​​ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Update: 2022-12-30 07:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కన్నతల్లిని కోల్పోయిన బాధలోను నరేంద్రమోడీ దేశ ప్రధానిగా తన కర్తవ్య బాధ్యతలు మరువలేదు. బాధలో ఉన్నా సరే... తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా బంగాల్‌లో మొదటి వందే భారత్ ఎక్స్​ప్రెస్​​ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. వందే భారత్​ఎక్స్​ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రైన్​ హౌరా నుంచి న్యూజల్​పైగురి ప్రాంతానికి ప్రయాణిస్తుంది. మరోవైపు, అటు కోల్‌కతాలో జరిగే 'నేషనల్ గంగా కౌన్సిల్' సమావేశంలో పీఎం మోడీ వర్చువల్‌గా పాల్గొంటారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. దీంతో, హ్యాట్సాఫ్ మోడీ నిజమైన నాయకుడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్​మోడీ శుక్రవారం ఉదయం 3:30 సమయంలో కన్నుమూశారు. గాంధీనగర్​లోని సెక్టార్ 30లో హీరాబెన్​ అంత్యక్రియలు పూర్తయ్యాయి.​

Tags:    

Similar News