రూ.50వేలు పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

దిశ, వెబ్‌డెస్క్: చర్మవ్యాధితో మరణించిన పశువులుకు రూ. 50,000 నష్టపరిహారం కింద పాడి రైతులకు ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి హర్‌ సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు.

Update: 2022-08-16 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: చర్మవ్యాధితో మరణించిన పశువులుకు రూ. 50,000 నష్టపరిహారం కింద పాడి రైతులకు ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి హర్‌ సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. పసువుల పర్యవేక్షణ కోసం టీకాలు అందించాలన్నారు. పంజాబ్‌ ఆప్ ప్రభుత్వం అసమర్థత కారణంగా లంపి చర్మ వ్యాధితో వందలాది జంతువులు మరణిస్తున్నాయని ఆమె ఆరోపించారు. పంజాబ్‌లో ఇప్పటివరకు 2,100 కంటే ఎక్కువ పశువులు చనిపోయాయని తెలిపారు.

దీంతో రైతులతో పాటు డెయిరీ యజమానులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. లంపి చర్మ వ్యాధి అరికట్టడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జంతువుల పర్యవేక్షణకు టీకాలు వేయడానికి కేంద్ర బృందాలను పంపాలని కోరారు. పసువులను కోల్పోయిన పాడి రైతులకు సీఎం భగవంత్ మాన్ రూ. 50,000 పరిహారం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే లంపి చర్మ వ్యాధి ఆవులు, గేదెలకు ప్రధానంగా రక్తాన్ని తినే కీటకాల ద్వారా సోకుతుంది.

మాజీ మంత్రి సుభాష్ సింగ్ కన్నుమూత.. 


Similar News