కేరళలో మరో మంకీ పాక్స్ కేసు నమోదు

భారత్ లో నేడు మూడో మంకీ పాక్స్(MPox) కేసు నమోదైంది.

Update: 2024-09-27 12:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో నేడు మూడో మంకీ పాక్స్(MPox) కేసు నమోదైంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న ప్రాణాంతక వ్యాధి మంకీ పాక్స్. ఈ నేపథ్యంలో భారత్ లో మెల్లిగా కేసుల సంఖ్య పెరగడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా కేరళలోని ఎర్నాకులమ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా.. అతడి నమూనాలు పాజిటివ్ గా తేలాయి. దీంతో భారత్ లో మంకీ పాక్స్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. భారత్ లో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదవగా.. సెప్టెంబర్ 18న రెండవ కేసు నమోదైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) లెక్కల ప్రకారం 122 దేశాల్లో 99,518 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువ వ్యాప్తిలో ఉన్నందున అక్కడి చాలా దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. భారత వైద్యారోగ్య మంత్రిత్వశాఖ వెల్లడి చేసిన వివరాల ప్రకారం మంకీపాక్స్ లక్షణాలు.. జ్వరం, తలనొప్పి, ఒళ్ళునొప్పులు, కాళ్ళు చేతుల్లో దురద, పొక్కులు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తితో సన్నిహితంగా మెలగడం, వాళ్ళ వస్తువులు ముట్టుకోవడం వల్ల ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది.     


Similar News