‘జానీ జానీ ఎస్ పాపా’ కాదు.. కేజ్రీవాల్.. కేజ్రీవాల్ ఎస్ పప్పా.. సుఖేశ్ మరో ఆసక్తికర లేఖ

మనీలాండరింగ్ కేసు వ్యవహారంలో తీహార్‌ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ తాజాగా మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఆసక్తికర లేఖ విడుదల చేశారు.

Update: 2024-04-30 06:19 GMT
‘జానీ జానీ ఎస్ పాపా’ కాదు.. కేజ్రీవాల్.. కేజ్రీవాల్ ఎస్ పప్పా.. సుఖేశ్ మరో ఆసక్తికర లేఖ
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: మనీలాండరింగ్ కేసు వ్యవహారంలో తీహార్‌ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ తాజాగా మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఆసక్తికర లేఖ విడుదల చేశారు. డియర్ కేజ్రీవాల్ జీ.. గత కొన్ని రోజుల నుంచి మీ డ్రామా, జైల్లో మీ అధికారులు.. బాబీజీ.. ఆస్కార్ లేవల్ యాక్టింగ్ చూస్తూనే ఉన్నా.. అని లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని చూస్తే నేను ప్లే స్కూల్‌లో నేను నేర్చుకున్న రైమ్స్ గుర్తొస్తున్నాయి.. ‘కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఎస్ పప్పా.. షుగర్ తింటున్నావా? నో పప్పా.. అబద్ధాలు చెప్పడం? నో పప్పా.. ప్రజలను మోసం చేస్తున్నావు? నో పప్పా.. డైట్ చార్ట్ బహిర్గతం.. హా, హా, హా’ అని సుఖేష్ విమర్శించారు.

తీహార్ జైల్లో కేజ్రీవాల్ వారి సన్నిహితులతో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. మరోవైపు ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మెడికల్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, మోసాలను ప్రజలు గమనిస్తారని.. ప్రజలు ఎవరూ మోసపోరన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరించరని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ జైళ్లు కేజ్రీవాల్ ఆధీనంలో ఉన్నాయన్నారు. త్వరలోనే కేజ్రీవాల్‌కు శిక్ష పడుతుందని, లిక్కర్ కేసు ఒకటే కాదు.. చాలా కేసుల్లో కేజ్రీవాల్ ఉన్నారని ఆరోపించారు. ఒక్కొక్కటిగా బైటకు వస్తాయని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News