ఇక కృష్ణజన్మ భూమిపై ఫోకస్: యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం పూర్తి కావడంతో ఇక బీజేపీ శ్రీకృష్ణ జన్మభూమిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలే అందుకు ఊతమిచ్చాయి.
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం పూర్తి కావడంతో ఇక బీజేపీ శ్రీకృష్ణ జన్మభూమిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలే అందుకు ఊతమిచ్చాయి. గవర్నర్ ప్రసంగంపై దన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడిన యోగీ.. కాశీ, మధుర, అయోధ్య వివాదాలపై స్పందించారు. ‘అయోధ్యలో ఉత్సవాలు జరిగినప్పుడు నందిబాబా నేనెందుకు వెయిట్ చేయాలి అన్నాడు. ఎదురుచూడకుండా రాత్రికి రాత్రే బారికేడ్లు పగలగొట్టాడు’ అని చెప్పారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఎక్కువ కాలం వేచి ఉండటానికి సిద్ధంగా లేడు అని వెల్లడించారు. ‘5000 ఏళ్ల క్రితం కృష్ణుడు పాండవులకు ఐదు గ్రామాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ మేము మూడు పవిత్ర స్థలాలు అయోధ్య, కాశీ, మధుర మాత్రమే అడుగుతున్నాం’ అని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వేల సంవత్సరాలుగా మెజారిటీ కమ్యునిటీ తమ హక్కులను అడుక్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్ణానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు హిందూ పిటిషనర్లకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని శివుడినే నందిబాబాగా పిలుస్తుంటారు.