బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై ఎంక్వైరీ చేయాల్సిందే.. : సోనియా గాంధీ
బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై విచారణ చేపట్టాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
దిశ, వెబ్డెస్క్: బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై విచారణ చేపట్టాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరగాల్సిందే అని సోనియా అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి 56 శాతం నిధులు వస్తే.. కాంగ్రెస్కు 11 శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయన్నారు. బీజేపీకి వేల కోట్ల రుపాయాల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అక్రమంగా కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేశారన్నారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బ తీయాలన్నదే బీజేపీ కుట్ర అని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఖాతాలను ఎలా ఫ్రీజ్ చేస్తారని బీజేపీపై ఖర్గే మండిపడ్డారు.
ఫండ్స్ని కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ను దెబ్బ తీయాలని చూస్తున్నారన్నారు. సీతారామ్ కేసరి కాలం నాటి అంశాలపై ఇప్పడు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న లోపాలను అడ్డుపెట్టుకుని తీవ్ర చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రజాస్వామ్యం బతకడం కష్టమన్నారు. నెలరోజులకు పైగా తమ అకౌంట్లను ఫ్రీజ్ చేశారని.. దీంతో మా ఖాతాల్లోని రూ.285 కోట్లు వాడుకోలేకపోతున్నామన్నారు. ఏ పార్టీకి లేని నిబంధనలన్నీ కాంగ్రెస్ కే వర్తిస్తాయా? అన్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో అకౌంట్లు ఫ్రీజ్ చేయడం దారుణమన్నారు. నిధులు వాడుకోలేకపోతే మేం ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాం అని ప్రశ్నించారు.