సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న.. ఎందుకో తెలుసా !

ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మరదలు వరస అయ్యే వారినో లేక, దగ్గరి స్నేహితురాలినో పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా సొంత చెల్లినే పెళ్లి

Update: 2023-02-11 08:50 GMT

 దిశ, వెబ్‌డెస్క్ :   ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మరదలు వరస అయ్యే వారినో లేక, దగ్గరి స్నేహితురాలినో పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆయన తన చెల్లిని ఎందుకు చేసుకున్నాడో తెలిసి ప్రతి ఒక్కరు షాక్‌కు గురి అవుతున్నారు. అసలేమైందో తెలుసుకుందాం.

ఉత్తర్ ప్రదేశ్‌లోని టుండ్ల బ్లాక్ పరిధిలో సీఎం 51 జంటలకు వివాహాలు జరిపించారు.వీరందరి ఖర్చు ప్రభుత్వమే భరించి వీరికి పెళ్లికి కావాల్సిన ఆభరణాలు, దుస్తులు, గృహోపకరణాలు కానుకగా ఇచ్చింది. ఇలా ఇవ్వడం చూసిన ఓ వ్యక్తి ప్రభుత్వ కానుకలకు ఆశపడి తన సొంత చెల్లిని తీసుకొని వివాహం చేసుకున్నాడు. చివరికి ఈ విషయం ప్రభుత్వ అధికారులకు తెలియడంతో, వారు అన్నాచెల్లిపై కేసునమోదు చేశారు.ప్రస్తుతం ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

Tags:    

Similar News