'మానవ బాంబులను' నియమించుకున్న అమృతపాల్..!
ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృత పాల్ సింగ్ ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృత పాల్ సింగ్ ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్ పోలీసలు అతనిని ఆరెస్ట్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నింస్తున్నప్పటి అతను తప్పించుకుని తీరుగుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ఇంటర్నెట్ నిలిపివేశారు. ఈ క్రమంలో అమృత పాల్ సింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతను డ్రగ్స్ డి-అడిక్షన్ సెంటర్లలో 'బ్రెయిన్‌వాష్' చేసి వారిని 'ఖడ్కూస్' లేదా 'హ్యుమన్ బాంబ్ గా మార్చినట్లు భద్రతా సంస్థలు వారికి లభించిన ఆధారంగా తెలుపుతున్నారు. ఆయుధాలను నిల్వ చేసేందుకు సింగ్ గురుద్వారాను ఉపయోగిస్తున్నారని, ఆత్మాహుతి దాడులకు యువతకు శిక్షణ ఇస్తున్నారని కూడా ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
Also Read..