Amith shah: 2026 మార్చి నాటికి మావోయిస్టుల నుంచి విముక్తి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026 మార్చి నాటికి భారతదేశాన్ని మావోయిస్టుల హింస నుంచి విముక్తి చేస్తుందని అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

Update: 2024-08-24 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2026 మార్చి నాటికి భారతదేశాన్ని మావోయిస్టుల హింస నుంచి విముక్తి చేస్తుందని అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం రాయ్ పూర్‌లో మీడియాతో మాట్లాడారు. వామపక్ష తీవ్ర వాదంపై దాడికి సమయం ఆసన్నమైందని చెప్పారు. దేశంలో గత నాలుగు దశాబ్దాల్లో 17,000 మంది నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ‘నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పథకాలను100 శాతం అమలు చేస్తున్నాం. అటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతికి ఎదురయ్యే సవాళ్లను తొలగించడం కోసం కృషి చేస్తున్నాం’ అని చెప్పారు.

నక్సలిజాన్ని రూపుమాపడానికి రెండు లక్ష్యాలతో పని చేశామని తెలిపారు. మొదటిది నక్సల్ ప్రభావిత ప్రాంతంలో రూల్ ఆఫ్ లా ఏర్పాటు చేయడం, అలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడమని వెల్లడించారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా పాల్గొన్నారు. కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 142 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News