ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్.. రూ.58 ట్రిలియన్లకు పెరిగిన అప్పులు..

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ ప్రభుత్వ అప్పులు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి.

Update: 2023-06-06 12:44 GMT

ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ ప్రభుత్వ అప్పులు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. గత ఏడాది వ్యవధిలో అప్పులు 34.1 శాతం పెరిగి రూ. 58.6 ట్రిలియన్‌లకు చేరుకున్నాయని పాక్ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో స్థానిక ఆర్థిక సంస్థలు, పొదుపు పథకాల నిధులు, బాండ్ల జారీ నుంచి పొందిన దేశీయ రుణం రూ. 36.5 ట్రిలియన్లు (62.3 శాతం) కాగా.. విదేశాలు, విదేశీ సంస్థల నుంచి తీసుకున్న లోన్స్ రూ. 22 ట్రిలియన్లు (37.6 శాతం) ఉన్నాయని పేర్కొంది.

2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న ఫారిన్ లోన్స్ 49.1 శాతం ఎక్కువని తెలిపింది. పాకిస్తాన్‌లో విదేశీ మారక నిల్వలు కూడా గణనీయంగా పడిపోయాయి. ఏప్రిల్‌లో పాక్‌లో ద్రవ్యోల్బణం 36.4 శాతం పెరిగింది. ప్రధానంగా ఆహార ధరల సంక్షోభం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. వడ్డీ రేట్లు మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరుకున్నాయి.

Tags:    

Similar News