క్రీడల వీక్షణలో సోషల్ మీడియా టాప్.. పట్టణ జనాభాలో సగం మంది దీనిపైనే..

క్రీడలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. సోషల్ మీడియా ఉండగా బెంగ ఎందుకు.. దేశంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరు సోషల్ మీడియా వినియోగదారులు స్పోర్ట్స్ కంటెంట్ నే సెర్చ్ చేస్తున్నారు.

Update: 2023-05-24 14:01 GMT

న్యూఢిల్లీ: క్రీడలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. సోషల్ మీడియా ఉండగా బెంగ ఎందుకు.. దేశంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరు సోషల్ మీడియా వినియోగదారులు స్పోర్ట్స్ కంటెంట్ నే సెర్చ్ చేస్తున్నారు. క్రీడా వివరాలు తెలుసుకునేందుకు క్రీడా ప్రేమికులు అత్యంత ఇష్టపడే మాధ్యమంపై ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ‘ది గ్లోబల్ స్పోర్ట్స్ మీడియా ల్యాండ్ స్కేప్’ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. పట్టణ ప్రజల్లో దాదాపు 67% మంది గత 30 రోజుల్లో వివిధ మీడియా ప్లాట్ ఫారమ్ ల ద్వారా క్రీడలను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారు. క్రికెట్ సహా వివిధ క్రీడల ప్రత్యక్ష ప్రసారాన్ని 36% మంది టీవీ ఛానెళ్లలో వీక్షిస్తున్నారు. మరో 35% మంది యూ ట్యూబ్ పై ఆధారపడుతున్నారు.

85% భారతీయులకు క్రీడా సమాచారంపై ఆసక్తి..

ఇండోనేషియా, యూఏఈలో 89% మంది సాంప్రదాయ, డిజిటల్ మీడియా ద్వారా క్రీడలను గురించిన సమాచారాన్ని నిత్యం తెలుసుకుంటున్న వారు 89% మంది ఉన్నారు. భారత్ లో 85% మంది వివిధ మీడియా ప్లాట్ ఫారమ్ ల ద్వారా క్రీడల గురించి తెలుసుకుంటున్నారు. యూరోపియన్ దేశాలు, అమెరికాలో మాత్రం క్రీడలపై ఆసక్తి కనబర్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. క్రీడల గురించి తెలుసుకునే ప్రధాన సాధనం లైవ్ టీవీ అని సర్వే చేసిన 18 సంస్థల్లో 12 సంస్థలకు క్రీడాభిమానులు తెలిపారు.

సోషల్ మీడియాపై ఆధారపడతామని 35-44 ఏళ్ల వయసు గల వారిలో 46% మంది అభిప్రాయపడ్డారు. లైవ్ టెలికాస్ట్ పై ఆధారపడతామని 55 ఏళ్లు పైబడిన వారిలో 50% మంది పేర్కొన్నారు. క్రీడా సమాచారం కోసం స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ లేదా సర్వీస్ ను సబ్ స్క్రయిబ్ చేసుకున్నామని పట్టణ జనాభాలో దాదాపు సగం (45%) మంది తెలిపారు. డిజిటల్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్, కంటెంట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా క్రికెట్ నిలిచింది. 72% మంది పట్టణ భారతీయులు క్రికెట్ కంటెంట్ అందించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కు చందాదారులుగా మారుతున్నారు. సాకర్ ను 40% మంది, టెన్నిస్ ను 32% మంది ఆదరిస్తున్నారు.

Tags:    

Similar News