కూటమికి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: సీఎం కేజ్రీవాల్

2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఐదో దశ పోలింగ్ మే 20(సోమవారం) పూర్తయ్యాయి.

Update: 2024-05-21 05:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఐదో దశ పోలింగ్ మే 20(సోమవారం) పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఐదో దశ ఎన్నికలు విజయవంతంగా ముగిసిపోయాయి. తదుపరి రెండు దశల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జూన్ 4న మోడీ ప్రభుత్వం విడిపోయి, భారత కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే భారత కూటమికి 300 కంటె ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి మనీ లాండరీంగ్ కేసులో జైలులో ఉన్న కేజ్రీవాల్ ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ పై బయటకు వచ్చారు. అనంతరం బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే తనతో పాటు ఆప్ మంత్రులను కూడా జైల్లో వెస్తారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

Read More..

లిక్కర్ కుంభకోణం.. కేజ్రీవాల్ కస్టడీ కోరుతూ కోర్టుని ఆశ్రయించిన ఈడీ 

Tags:    

Similar News