బంగ్లాదేశ్ సంక్షోభంపై భారత అఖిలపక్ష సమావేశం.. హాజరైన జైశంకర్

హింసాత్మక నిరసనల మధ్య బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం రాజీనామా చేశారు. దీంతో ఆ దేశంలో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతుంది.

Update: 2024-08-06 05:19 GMT
బంగ్లాదేశ్ సంక్షోభంపై భారత అఖిలపక్ష సమావేశం.. హాజరైన జైశంకర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హింసాత్మక నిరసనల మధ్య బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం రాజీనామా చేశారు. దీంతో ఆ దేశంలో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతుంది.ఈ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వం పతనంపై వైఖరిని అంచనా వేయడానికి వ్యూహరచన చేయడానికి ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తోంది. ప్రస్తుతం బంగ్లాలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సైన్యం ప్రణాళికలను ప్రకటించింది.

బంగ్లాదేశ్‌లో పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు. అయితే, 15 గంటలకు పైగా భారత్‌లో ఆశ్రయం పొందిన హసీనాతో మోదీ భేటీ అవుతారా లేదా అన్నది తీవ్రమైన ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలనే దాని పై అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా.. పార్లమెంట్‌కు రాజ్‌నాథ్‌, అమిత్‌షా చేరుకున్నారు. వారికి బంగ్లాదేశ్‌ పరిస్థితులను విదేశాంగమంత్రి జైశంకర్‌ వివరించనున్నారు. కాగా ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్‌, మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.


Similar News