కాంగ్రెస్ సర్కారు ఏ క్షణమైనా కూలొచ్చు : కుమారస్వామి

Update: 2023-12-10 17:23 GMT

బెంగళూరు : జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక మంత్రి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందన్నారు. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల ఉచ్చు నుంచి బయటపడటానికి ఆ కాంగ్రెస్ నేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి.. 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నాడు. అతడు ప్రస్తుతం బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నాడు’’ అని కుమారస్వామి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా బాగాలేదు. ఈ సర్కారు ఎప్పుడు కూలుతుందో తెలియదు’’ అని తెలిపారు. ఇంతకీ ఆ కీలకమైన మంత్రి ఎవరని విలేకరులు కుమారస్వామిని ప్రశ్నించగా.. చిన్నపాటి నాయకులు అంతమంది ఎమ్మెల్యేలతో జంపయ్యే స్కెచ్‌ను గీయలేరన్నారు. కర్ణాటకలో ఏ క్షణంలోనైనా మహారాష్ట్ర తరహా సీన్ రిపీట్ కావచ్చని కుమారస్వామి జోస్యం చెప్పారు.


Similar News